Get Mystery Box with random crypto!

TRS Party

टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party T
टेलीग्राम चैनल का लोगो trspartyonline — TRS Party
चैनल का पता: @trspartyonline
श्रेणियाँ: राजनीति
भाषा: हिंदी
ग्राहकों: 2.03K
चैनल से विवरण

Bharat Rashtra Samithi (BRS Party), an Indian political party founded by Sri KCR.

Ratings & Reviews

2.33

3 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

1

3 stars

0

2 stars

1

1 stars

1


नवीनतम संदेश 32

2022-05-05 15:26:28 సిద్దిపేట జిల్లా ములుగు ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన విధానాలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ 2వ సమావేశంలో
మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ గంగుల కమలాకర్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీ కొప్పుల ఈశ్వర్, ఎంపీ శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ శ్రీ వంటేరు ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ...

వ్యవసాయంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలి

వ్యవసాయ యాంత్రీకరణలో ఊబర్, ఓలా తరహా సేవలు అందస్తే అది విప్లవాత్మక మార్పుకు నాందీ అవుతుంది

ఊబర్, ఓలా కార్లు, బైకులు నడుపుతూ లక్షల మంది ఉపాధి పొందుతున్నారు

వ్యవసాయ రంగంలో ఈ తరహా సేవలు అందుబాటులోకి రావాలి

ఐటీ, పరిశ్రమల శాఖ ఈ విషయంపై చొరవ తీసుకోవాలి

వ్యవసాయంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, వ్యవసాయ యాంత్రీకరణలో ఊబర్, ఓలా తరహా సేవలు అందస్తే అది విప్లవాత్మక మార్పుకు నాందీ అవుతుంది

కోట్లాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి .. అందుకే వ్యవసాయ యాంత్రీకరణపై దృష్టి సారించాలి

రైతువేదికలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి .. ఐటీ శాఖ సహకారంతో రైతులకు వ్యవసాయంలో మెళకువలు తెలుసుకునేందుకు సాయం అందించాలి

వ్యవసాయంలో తెలంగాణ నేడు దేశానికి ఆదర్శం

ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ప్రాధాన్యం వ్యవసాయం

కేసీఆర్ ఆలోచనలు అన్నీ రంగరించి వ్యవసాయం బలోపేతం చేసి, రైతును రాజుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు

కంట్రోల్ బియ్యం కోసం ఎదురుచూసిన పరిస్థితి నుండి నేడు కేంద్రం తెలంగాణలో ఉత్పత్తి అయిన వరి ధాన్యం కొనుగోలు చేయలేక చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది

వ్యవసాయరంగంలో అనుసరించాల్సిన విధానాల రూపకల్పనలో భాగంగా సబ్ కమిటీ అవసరాన్ని బట్టి వివిధ ప్రాంతాలను సందర్శించి పూర్తి అవగాహనతో విధానాలు రూపొందించాలి

వానాకాలంలో రైతులు పత్తి పెద్ద ఎత్తున సాగు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం

పప్పు, నూనెగింజల పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం

రైతుబంధు అందుకుంటున్న వారిలో 92.5 శాతం మంది ఐదెకరాల లోపు వారే .. 5 నుండి 10 ఎకరాలు ఉన్నవారు ఆరుశాతం

వ్యవసాయం గౌరవ ప్రదమైనది, పని చేయడం నామోషీ కాదు అన్న భావన మన యువతలో రావాలి .. ఆ దిశగా కృషిచేయాలి ... విదేశీ యువతకు, మన యువతకు ఉన్న తేడా అదే

వినియోగదారులకు బలవర్దకమైన, నాణ్యమైన ఆహారం అందేలా కృషిచేయాల్సిన మనందరి మీద ఉంది

రాష్ట్రంలోని రైతులను వివిధ ప్రాంతాలకు విడతల వారీగా తీసుకువెళ్లి అక్కడి వ్యవసాయ పద్దతులు, విధానాలపై అవగాహన కల్పించాలి

ఉద్యానపంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలి

రాష్ట్రంలో విపక్షాలు రైతుల ప్రయోజనాలను వదిలేసి రాజకీయాలు చేస్తున్నారు

రైతుల శ్రేయస్సు దృష్ట్యా ధాన్యం కొనుగోలుకు నిర్ణయం

5 లక్షల ఎకరాలలో ఆలుగడ్డ సాగయితే తెలంగాణ అవసరాలు తీరతాయి .. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి

- మంత్రి శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ...

వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారుల ఆలోచనా విధానం మారాలి

రైతుల ఆదాయం రెట్టింపు అన్నది ఒక్క చైనాలోనే సాధ్యం అయింది .. నాకున్న సమాచారం ప్రకారం అది మరెక్కడా సాధ్యం కాలేదు

2022 వరకు మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని విఫలమయ్యారు

దేశంలో దాదాపు 60 - 65 శాతం జనాభా వ్యవసాయం , దాని అనుబంధ రంగాల మీద ఆధారపడింది .. కానీ దేశ జీడీపీలో దాని వాటా 15 శాతం దాటడం లేదు

వ్యవసాయంలో రైతుకు ఆదాయం ఎలా వస్తుందో ఆలోచన చేయాలి .. చైనా, ఇజ్రాయిల్ లలో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలి

1987 లో చైనా - ఇండియా జీడీపీ సమానం

35 ఏళ్లలో చైనా 16 ట్రిలియన్ డాలర్లకు చేరింది .. ఇండియా 3 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది

తెలంగాణలో వరి మళ్లలో చేపలు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది .. ఈ దిశగా ప్రయత్నించాలి

వ్యవసాయానికి ఆధునికతను జోడిస్తే యువత ఈ దిశగా మళ్లే అవకాశం ఉంది

తెలంగాణలో బ్లూ, పింక్, వైట్, ఎల్లో,గ్రీన్ విప్లవాలు విజయవంతమయ్యే అవకాశాలున్నాయి

ఈ తరం, కొత్తతరం ఎందుకో వ్యవసాయానికి దగ్గర కావడం లేదు

పాత, కొత్త అనుభవాలతో ఒక కొత్త విధానం తీసుకురావాలి .. యువతను ఆకర్షించాలి

తెలంగాణ 32 జిల్లాలలో ప్రతి చోటా 25 ఎకరాలలో రైతుశిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి .. కొత్త తరానికి వ్యవసాయాన్ని పరిచయం చేయాలి

వ్యవసాయానికి ఆధునికతను జోడించేలా శాస్త్రవేత్తలు ఆలోచించాలి

చిన్ననాటి నుండే పిల్లలలో వ్యవసాయంపై మక్కువ కలిగేలా చేయాలి

పౌల్ట్రీ, పత్తి, వేరుశెనగలకు తెలంగాణ ప్రసిద్ధి

ఏడాదికి రెండు సార్లు 10 రోజులపాటు వ్యవసాయ ప్రగతిపై రోజుకొక కార్యక్రమం నిర్వహించాలి .. దీనిపై క్యాలెండర్ తయారుచేయాలి .. రైతు దినోత్సవం నిర్వహించాలి
151 views12:26
ओपन / कमेंट
2022-05-05 12:49:03
206 views09:49
ओपन / कमेंट
2022-05-05 12:49:00 - ఇలాంటి పరిస్థితులలో రైతు సంఘర్షణ సభ పేరుతో తెలంగాణలో రాజకీయం చేసేందుకు వస్తున్న రాహుల్ గాంధీ పై అంశాలపైన తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని బహిరంగలేఖ ద్వారా డిమాండ్ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
201 views09:49
ओपन / कमेंट
2022-05-05 12:49:00 తెలంగాణ పర్యటనకు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ

- దశాబ్దాలపాటు నాటి కాంగ్రెస్ పార్టీ పాలన పాప ఫలితమే కదా వ్యవసాయరంగ దయనీయస్థితి

- కాంగ్రెస్ పార్టీ అంతులేని వైఫల్యాల చరిత్రను ఒక్క లేఖలోనో.. ఒక్క మాటలోనో చెప్పడం సాధ్యంకాదు.

- యూపీఏ పదేండ్ల పాలనలో ఎక్కడచూసినా రైతన్నల మరణమృదంగ విషాదమే కాదా?

- NCRB లెక్కల ప్రకారమే 1,58,117 రైతులు అప్పుల పాలై, ఆత్మహత్యలు చేసుకున్న విషయం వాస్తవం కాదా?

- తెలంగాణ ఆవిర్భావానికి ముందు పదేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ రైతాంగానికి ఒరిగింది శూన్యం

- నిలకడలేని కరంటు, అర్ధరాత్రి కరెంట్ తో అనేక మంది పాముకాటుకు, కరంటుషాక్ లకు గురయి వేలమంది మరణించింది నిజం కాదా ?

- పండించిన పంటను కొనమని, బకాయిలు అడిగిన ఎర్రజొన్న రైతులను కాల్చి చంపిన కర్కశ పాలన కాంగ్రెస్ ది కాదా ?

- నాడు రైతులపైన తుపాకి తూటాలు పేల్చిన మీరు ఇయ్యాల రైతు సభలు పెడ్తరా...?

- ప్రభుత్వ భూములు పంచాలని, పేదలకు ఇంటి జాగాలు పంచాలని డిమాండ్ చేస్తూ జరిగిన ముదిగొండ ధర్నా మీద కాల్పులు జరిపి ఏడుగురి ప్రాణాలు బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ కాదా ?

- బుల్లెట్లు కురిపించి రైతులను పొట్టన పెట్టుకున్న పాపానికి, ముందు క్షమాపణలు చెప్పండి.

- తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపాలని నీచమైన రాజకీయాలు చేసిన కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతారా.?.

- రైతాంగాన్ని రక్తకన్నీరు పెట్టించిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అన్నదాత ఎన్నటికీ క్షమించడు!

- వరిధాన్యం కొనుగోలుపై మోడీ సర్కారు మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతు ఆందోళనకు దిగినప్పుడు ఎక్కడ పడుకున్నారు ?

- తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల పథకాలను ఇతర రాష్ట్రాలలో అమలు చేయాలని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలు చేస్తామని సభలు ఎందుకు పెట్టరు ?

- వ్యవసాయం మీద, రైతుల కష్టాల మీద రాహుల్ గాంధీకి ఉన్న అవగాహన ఏంటి ? రాహుల్ గాంధీ వ్యవసాయం గురించి మాట్లాడటం అంటే అదొక వింత కాదా ?

- కేవలం ఎనిమిదేళ్ల పాలనలో 58 ఏళ్ల అన్యాయాలను తుడిచిన ఘనత మా రైతు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది .. వ్యవసాయరంగానికి సాగునీరు, రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు, కరంటు మౌళిక వసతుల కల్పన కోసం అన్నీ కలిపి ఈ ఎనిమిదేళ్లలో రూ.3 లక్షల 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుది

- ఈ దేశంలో రైతుకు 24గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ ఎనిమిదేండ్లలో ఉచిత విద్యుత్ కోసం 87 వేల కోట్లకుపైగా ఖర్చు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే కదా ?

- ఈ వెలుగులను కూడా ఓర్చుకోలేక మీ లోకల్ కాంగ్రెస్ నాయకులు 4వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలని కేంద్రానికి లేఖలు రాస్తూ రైతు ద్రోహానికి పాల్పడుతున్నారు. భవిష్యత్లో రైతుకు కరెంట్ కష్టమే రానివ్వకుండా కాపాడే యాదాద్రి థర్మల్ ప్లాంట్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూసేస్తామని మీ పార్టీ పార్లమెంట్ సభ్యులు ప్రకటనలు చేస్తున్నారు. దీనికి మీరు ఏం చెబుతారు..?

- దేశ చరిత్రలో అత్యధిక కాలం అటు కేంద్రంలో... దశాబ్దాల పాటు ఇటు రాష్ట్రాల్లో అధికారం చలాయించిన కాంగ్రెస్ పార్టీ... ఆ తర్వాత వచ్చిన బిజెపి పార్టీల అసమర్థ విధానాల వల్లనే ఈ రోజు దేశం ఈ దుస్థితిలో ఉన్నది.

- ముఖ్యంగా అర్ధ శతాబ్దానికి పైగా కేంద్రంలో అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ అనేక రంగాల్లో ఇండియాను అగ్రస్థానంలో నిలిపే అవకాశాలను జారవిడిచి... అన్ని రంగాలను దిగజార్చింది.

- తెలంగాణ ప్రాంతానికి 60 ఏండ్లు కాంగ్రెస్ చేసిన ద్రోహాలను తట్టుకుని ప్రజల ఆకాంక్షలు, పోరాటాలకు అండగా నిలిచి, అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించుకున్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మా ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పరిపాలనతో పరిఢవిల్లుతున్నది.

- ఈ రోజు తెలంగాణ విధానాలను దేశం స్వాగతిస్తూ, స్వీకరిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయరంగంలో చేపట్టిన విప్లవాత్మకమైన కార్యక్రమాలను దేశం ఆదర్శంగా తీసుకుంటున్నది.

- అన్నదాత ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షల రూపాయల ఆర్థికసాయం చేసే కుటుంబాలను రోడ్డున పడకుండా ఆదుకునే రైతు భీమా తీసుకొచ్చిన మా మానవీయ పాలన ఎక్కడ..? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వకుండా ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ. తిప్పుకున్న మీ క్రూరమైన పాలన ఎక్కడ..?

- 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించడం చేతగాలేదు

- 70వేల టిఎంసీల నీళ్లతో పొంగిపొర్లే జీవనదులున్నా, సగం కూడా వాడుకోలేక కరువు కాటకాలకు కారణమైన తెలివి తక్కువ, అసమర్థ పార్టీ మీది కాదా?
221 views09:49
ओपन / कमेंट
2022-05-05 06:14:31
291 views03:14
ओपन / कमेंट
2022-05-05 06:14:25 ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విద్యాశాఖ మంత్రి శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ శాసనసభ్యులు శ్రీ టి. ప్రకాష్ గౌడ్, భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణా రెడ్డి మరియు శాసనమండలి సభ్యులు శ్రీ యెగ్గె మల్లేశం గార్లకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు!

ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
286 views03:14
ओपन / कमेंट
2022-05-04 13:59:26
371 views10:59
ओपन / कमेंट
2022-05-04 13:59:19 జగిత్యాల పట్టణంలో రూ.17 కోట్లతో నూతనంగా నిర్మించిన వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారితో కలిసి ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు.
359 views10:59
ओपन / कमेंट
2022-05-04 12:02:12
380 views09:02
ओपन / कमेंट