2021-05-07 04:08:45
* Geography బిట్స్ *
*1. పీడన ప్రవణత అంటే?*
1) ఉత్తరం నుంచి దక్షిణ దిశగా ప్రతి
యూనిట్ దూరానికి పీడనంలో చోటుచేసుకునే వ్యత్యాసం
2) ప్రతి యూనిట్ దూరానికి పీడనంలో చోటు చేసుకునే మార్పురేటు
3) ప్రతి యూనిట్ దూరానికి పీడనం పెరుగుదల
4) ఏదీకాదు
*2.పవన వేగాన్ని కొలిచే సాధనం?*
1) ఎనిమోమీటర్
2) విండ్రోమ్
3) బారోమీటర్
4) ఆగ్రోమీటర్
*3.ప్రపంచ పవనాలు అంటే?*
1) ఒక గ్రహం నుంచి మరొక గ్రహానికి వీచే పవనాలు
2) సముద్రం నుంచి భూమిపైకి వీచే పవ నాలు
3) భూమి నుంచి ఇతర గ్రహాల మీదికి వీచే పవనాలు
4) పీడన వలయాల మధ్య వీచే పవనాలు
*4.కింది వాటిని జతపర్చండి*
ఎ. శాంతా అనా 1. అర్జెంటీనా
బి. చినూక్ 2. ఆల్ఫ్స్
సి. ఫాన్ 3. రాకీస్
డి. జొండా 4. కాలిఫోర్నియా
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-3, బి-4, సి-2, డి-1
*5.బ్లిజార్డ్‌లంటే ఏమిటి?*
1) సహారాలో వేగంగా వీచే వేడి గాలులు
2) ఆస్ట్రేలియాలో వేగంగా వీచే వేడి గాలులు
3) ధృవ ప్రాంతాల్లో వీచే వేగవంతమైన శీతల పవనాలు
4) చైనా సముద్రంలోని చక్రవాత తుఫానులు
*6.రుతుపవనాలు ఏర్పడటానికి ప్రధాన కారణం?*
1) భూమి నీరు విభిన్న రీతుల్లో ఉష్ణాన్ని గ్రహించడం, చల్లబడటం
2) ఎగువ ట్రోపో ఆవరణంలో వీచే ‘జెట్’ ప్రహహాలు
3) 1 మాత్రమే
4) 1, 2
*7.ఒకే స్థలంలో రెండు రేఖలు కలిసి ఒకే వర్షపాతాన్ని కలిగి ఉండేదానిని ఏమని పిలుస్తారు?*
1) ఐసోబార్స్
2) ఐసోహైట్స్
3) ఐసోథెర్మ్స్
4) ఐసోహలైన్స్
*8.కింది వాటిని జతపర్చండి*
ఎ. బ్రిక్ ఫీల్డర్స్ 1. ఉత్తర కాలిఫోర్నియా
బి. సిరోకా 2. ఆస్ట్రేలియా
సి. బెర్గ్ 3. మధ్యధరా
డి. నార్తర్ 4. ఆఫ్రికా
1) ఎ-2, బి-3, సి-1, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-2, బి-1, సి-3, డి-4
*9.గాలిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు సాపేక్ష ఆర్ధ్రత ఏమవుతుంది?*
1) పెరుగుతుంది
2) మార్పు చెందుతుంది
3) తగ్గుతుంది
4) పెరగవచ్చు లేదా తగ్గవచ్చు
*10. మేఘాలు ఏర్పడటానికి కారణం ఏమిటి?*
1) సముద్రాల నుంచి నీరు భాష్పీభవనం చెందడం
2) వాతావరణంలో నీటి ఆవిరి సాంద్రీకరణం
3) పైకి పోతున్న వాయు ప్రవాహాలు
4) కిందికి పోయే వాయు ప్రవాహాలు
182 views01:08