Get Mystery Box with random crypto!

సీఎం కేసీఆర్ వెంటే ఎన్నారైలు..: అనిల్ కూర్మాచ‌లం తెలంగాణ లో ఉ | TRS Party

సీఎం కేసీఆర్ వెంటే ఎన్నారైలు..: అనిల్ కూర్మాచ‌లం

తెలంగాణ లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సందర్భంలో ఎన్నారైల‌మంతా కీల‌కంగా ప‌నిచేశామ‌ని తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచ‌లం పేర్కొన్నారు.

రాష్ట్రం ఏర్పడిన త‌ర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ.. దేశంలోనే నంబర్ వన్ స్టేట్‌గా నిలిచింద‌న్నారు. అన్ని రంగాల్లోనూ ముందుంద‌ని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే ద‌మ్ములేకే బీజేపీ నేతలు బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ కవిత మీద అనవసర ఆరోపణలు చేస్తున్నార‌న్నారు. తెలంగాణ ప్రజల‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలంతా దీన్ని ముక్త‌కంఠంతో ఖండిస్తున్న‌ట్టు చెప్పారు. తాము ఎమ్మెల్యే క‌విత స్ఫూర్తితోనే పనిచేస్తున్న‌ట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా ఎన్నారైలంద‌రం సీఎం వెంటే ఉంటామ‌ని అనిల్ కూర్మాచ‌లం స్ప‌ష్టం చేశారు. ఈ స‌మావేవంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎన్నారై నాయ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.