Get Mystery Box with random crypto!

ఇంజినీర్ల మీద, కింద పని చేసే కార్మికుల మీద, చిన్నాచితాక పొట్టక | TRS Party

ఇంజినీర్ల మీద, కింద పని చేసే కార్మికుల మీద, చిన్నాచితాక పొట్టకూటి కోసం పని చేసే కార్మికుల మీద కేసులు పెట్టొద్దని ఆ మంత్రికి చెబుతున్నా.

నీకు చేతనైతే.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ వద్ద పలుకుబడి ఉంటే.. ఎట్ల అయితే.. హైదరాబాద్‌ అంతటా మేం అండర్‌ పాస్‌లు, ఫ్లై ఓవర్‌లు, ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు కడుతున్నమో.. ఇవాళ కంటోన్మెంట్‌, ఇంకా కరీంనగర్‌, రామగుండం, ఇటు ఆదిలాబాద్‌ వెళ్లే మార్గంలో రక్షణ రంగానికి చెందిన భూములున్నవో చేతనైతే మాకు అప్పజెప్పు. వాటిని కూడా అద్భుతంగా స్కైవేలు, ఫ్లై ఓవర్‌లు కట్టి హైదరాబాద్‌ అంటే భారతదేశంలోనే అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉన్న నగరంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవడం కాదు. చేతనైతే సహాయం చేయండి.. లేదా కనీసం అడ్డం రాకండి.. ప్రతిదాంట్లో అడ్డంపడడం, ప్రతీదాంట్లో అపసవ్యపు కూతలు.. అపసవ్యపు మాటలు మాట్లాడడం మంచిది కాదని విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ మంత్రి కేటీఆర్‌ హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ సిహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ మాధవరం కృష్ణారావు, శ్రీ కెపి వివేకానంద గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత, ఎమ్మెల్సీలు శ్రీ శంబీపూర్ రాజు, శ్రీ నవీన్ కుమార్, శ్రీమతి వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.