Get Mystery Box with random crypto!

కూకట్ పల్లి నుండి హైటెక్ సిటీ వెళ్లే వాహనదారుల కోసం కైతలాపూర్ | TRS Party

కూకట్ పల్లి నుండి హైటెక్ సిటీ వెళ్లే వాహనదారుల కోసం కైతలాపూర్ వద్ద నిర్మించిన 675 మీటర్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి (RoB)ను పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు.

‘హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా.. ఎల్‌బీనగర్‌ నుంచి కూకట్‌పల్లి వరకు, ఉప్పల్‌ నుంచి శేరిలింగంపల్లి వరకు ఎక్కడ చూసినా ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌లు, ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు ఒకటి రెండు కాదు.. రూ.8052 కోట్లతో ఎస్సార్‌డీపీలో మొదటి దశ కింద 47 వివిధ కార్యకమాలు తీసుకున్నం. గత 8 సంవత్సరాల్లో ప్రభుత్వం కట్టిన 30వ ఫ్లై ఓవర్‌ ఇది. ఇంకా 17 వివిధ దశల్లో ఉన్నయ్‌.. వాటిని కూడా పూర్తి చేసి ఈ సంవత్సరం ఆరు.. మిగతా వాటిని వచ్చే సంవత్సరం హైదరాబాద్‌ ప్రజలకు కానుకగా అందించబోతున్నమని మంత్రి అన్నారు.

రెండోదశలో రూ.3115తో పనులు
రెండోదశ ఎస్సార్‌డీపీ పనుల కింద రూ.3115కోట్లతో మరికొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ‘హైదరాబాద్‌లో గానీ.. మహానగరాల్లో గానీ ఫ్లై ఓవర్‌లు, అండర్‌ పాస్‌లు, ఆర్‌యూబీలు, ఆర్‌ఓబీలు ఎందుకు కడుతున్నామంటే.. ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లినా.. ఏ నగరానికి పోయినా.. ఆ నగరం ప్రగతి, అభివృద్ధికి ముఖ్యంగా కొట్టొచ్చినట్లు కనబడే సూచిక.. ఏందంటే ఆ నగరంలో ఉండే రోడ్లు, ప్రజా రవాణా వ్యవస్థ. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ఆయన మనసులో ఎస్సార్‌డీపీ కార్యక్రమానికి బీజం పడిందో దానికి అనుగుణంగా.. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నం.

సహజంగా కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, హైదరాబాద్‌ పశ్చిమ, ఉత్తర ప్రాంతంలో ఇక్కడ పెద్ద ఎత్తున జనసాంద్రత ఎక్కువగా ఉన్నది. మైగ్రేషన్‌ కూడా విపరీతంగా ఉన్నది. ఇతర పట్టణాలు, రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుంటారు. విద్య, ఉపాధి అవకాశాల కోసం భారత్‌దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా మన వద్దకు వస్తుంటారు. వచ్చిన సమయంలో ఒత్తిడి, తాకిడి ఎక్కువగా ఉంటది. అందుకే మంచినీళ్ల సౌలత్‌, మోరీలు కానీ, కరెంటు కానీ, రహదారులు గానీ.. ప్రజలు కోరుకునే మౌలిక సదుపాయాలపై వాటిపై దృష్టి పెట్టి పని చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు దశల వారీగా కార్యక్రమాలు చేసుకుంటూపోతున్నాం’ అన్నారు.

70 సంవత్సరాల్లో ఎవరూ పట్టించుకోలే..
ఐడీపీఎల్‌.. ఒకప్పుడు దశాబ్దాల కిందట భారతదేశంలో ఇక్కడే ఔషధాలు తయారు కావాలి, ఇక్కడే ఫార్మాస్యూటికల్స్‌ తయారు కావాలనే ఉద్దేశంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఐడీపీఎల్‌ సంస్థను కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిందని కేటీఆర్‌ తెలిపారు. ‘ఆ సంస్థకు వందల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచే కారు చౌకగా.. దాదాపు ఫ్రీగా ఇచ్చినం. ఐడీపీఎల్‌ ఏర్పాటు చేసిన సమయంలో ఊరవతల ఉండేది. అప్పుడు హైదరాబాద్‌ చిన్నగా ఎంసీహెచ్‌ ఉండేది. కానీ తర్వాత పెరుగుతూ పెరుగుతూ భారతదేశంలోనే రెండు, మూడోస్థానానికి హైదరాబాద్‌ విస్తరించింది. ఈ క్రమంలో ఐడీపీఎల్‌ ఊరు మధ్యలోకి వచ్చింది. ఐడీపీఎల్‌ ఊరు మధ్యలోకి వచ్చిన సమయంలో చుట్టూ కాలనీలు, బస్తీలు అయ్యాయి. సహజంగా ఎమ్మెల్యేలు, మమ్మల్ని ఎవరం పోయినా అడుగుతరు.

అన్న ఇందులో నుంచి ఒక రోడ్‌ వేస్తే మాకు సౌలత్‌ ఉంటదని.. తిరిగిపోయే బాధ తప్పుతుందని, బాగుంటుందని రోడ్‌ వేయాలని కోరితే.. 70 సంవత్సరాల్లో ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎవరూ కనీసం చూసిన పాపానపోలేదు. ఐడీపీఎలే కాదు.. దిల్‌సుఖ్‌నగర్‌ అని ఒక ప్రాంతముంటుంది.. అక్కడ కూడా ఒక రోడ్‌ వేయాలని మాత్రమే కోరారు. రోడ్‌ వేయాలంటే దానికి కూడా ఎన్నో రకాల ఆటంకాలు.. రకరకాల తొంపులు పెట్టి ఇన్ని రోజులు కాకుండా చేశారు. కానీ కృష్ణారావు నాయకత్వంలో, మీ అందరి అభిమానంతో, సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో ఆ రోడ్లన్నీ పూర్తి చేసుకున్నం. ఈ రోజు బ్రహ్మాండంగా ఐడీపీఎల్‌ నుంచి కూడా, అదేవిధంగా దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి కూడా రోడ్లు వేసి.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు సౌలత్‌ కల్పించుకున్నం’ అన్నారు.

అద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉన్న నగరంగా తీర్చిదిద్దే బాధ్యత మాది
‘దురదృష్టం ఏంటంటే.. మనమేమో కొత్త రోడ్లు వేస్తున్నం. కొత్త ఫ్లై ఓవర్లు వేస్తున్నం. కొత్త అండర్‌ పాస్‌లు కడుతున్నం. కొత్త కొత్తగా రోడ్లు, లింకురోడ్లు వేసుకొని ప్రజలకు ఇంకా మెరుగైన రవాణా వసతి ఉండాలి, మౌలిక వసతులు బాగుండాలే, కొత్త కొత్త ఏరియాలు డెవలప్‌ కావాలే.. తిరిగిపోయే బాధ తప్పాలే. ట్రాఫిక్‌ జామ్‌ తప్పాలే.. పొల్యూషన్‌ తప్పాలని మనం చూస్తున్నాం. దురదృష్టం ఐడీపీఎల్‌ విషయంలో ఇక్కడ హైదరాబాద్‌ నుంచి ఉన్న కేంద్రమంత్రి ఆయన అంటడంట ‘పోలీస్‌ కేసులు పెట్టండి.. మేం ఎట్ల వేస్తరు రోడ్లు మేం చూస్తం అంటడట’.. నేను అడుగుతున్నా ఆ కేంద్రమంత్రి గారిని అయ్యా.. మీరు కనీసం కొత్తగా పైసా పని చేయరు హైదరాబాద్‌లో.. మేం పని చేస్తుంటే పోలీస్‌ కేసులు పెట్టమని ఆదేశాలు ఇస్తున్నరట. నీకు దమ్ముంటే.. నీకు చేతనైతే కేసు పట్టాల్సి వస్తే మున్సిపల్‌ మంత్రిగా నా మీద, ప్రభుత్వం మీద పెట్టు.