Get Mystery Box with random crypto!

శ్రీధర్ (స్విట్జ‌ర్లాండ్‌): సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి | TRS Party

శ్రీధర్ (స్విట్జ‌ర్లాండ్‌): సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి రావ‌డాన్ని ఆహ్వానిస్తున్నాం. స్విట్జ‌ర్లాండ్ ఎన్నారైల త‌ర‌ఫున హ‌ర్షం వ్య‌క్తంచేస్తున్నాం. సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.

అరవింద్ (జర్మనీ): తీర్మానానికి సంపూర్ణ‌ మద్దతు తెలుపుతున్నాం. జర్మన్ మీడియాలో కూడా బీజేపీ వాళ్ల మాట‌లు చాలా ఇబ్బందిపెట్టాయి. కేంద్రంలో కేసీఆర్ ఉంటేనే దేశంలో ముందుకు పోతుంది.


మహిపాల్ (ఒమ‌న్‌): అందరికీ శుభాభివంద‌నాలు… ఒమ‌న్‌ ఎన్నారైల త‌ర‌ఫున సీఎం కేసీఆర్ నిర్ణ‌యంపై హ‌ర్షం వ్య‌క్తంచేస్తున్నాం. మా సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంది.

సతీశ్ (బ‌హ్రెన్‌): తీర్మానానికి సంపూర మద్దతు ఇస్తున్నాం. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి సంతోష‌క‌రం. దేశం గ‌ర్వించేలా తెలంగాణ‌ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు దేశం వంతు వ‌చ్చింది.

కృష్ణప్రసాద్ (సింగపూర్): తీర్మానానికి సంపూర్ణ మ‌ద్ద‌తు తెలుపుతున్నాం. బీఆర్ఎస్‌తో కేసీఆర్ దేశాన్ని అభివృద్ధి బాట‌ప‌ట్టిస్తార‌నే గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాం. మా స‌హ‌కారం ఉంటుంది.

కృష్ణ (కెనడా): సీఎం కేసీఆర్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నాం. ఇప్పుడు దేశానికి బ‌ల‌మైన నాయ‌కుడు కావాలి. ఆ నాయ‌కుడు సీఎం కేసీఆరే. తెలంగాణ ప‌థ‌కాల‌న్నీ దేశ‌వ్యాప్తంగా అమ‌లుకావాలి.

రవీందర్ (చైనా ): మ‌హేశ్ బిగాల తీర్మానానికి మ‌ద్ద‌తు తెలుపుతున్నాం. ఎనిమిదేళ్ల‌లోనే తెలంగాణ రూపు రేఖ‌లు మార్చిన నాయ‌కుడు సీఎం కేసీఆర్‌. ఇప్పుడు దేశాన్ని అభివృద్ధిప‌థంలో న‌డిపిస్తారు.

అఫ్రోజ్ ఖాన్ (ఖ‌తర్): ప్ర‌స్తుత బీజేపీ స‌ర్కారు వ‌ల్ల దేశ ప్ర‌జ‌లు ఖ‌త‌ర్‌లో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌తం పేరుతో బీజేపీ ఆడుతున్న రాజ‌కీయ క్రీడ‌కు బ‌ల‌వుతున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల్లోకి రావ‌డ‌మే దీనికి విరుగుడు. ఆయ‌న‌కు మా సంపూర్ణ మ‌ద్ద‌తు తెలుపుతున్నాం.

రజినీకాంత్ (యూఎస్ఏ): బీఆర్ఎస్‌కు మా సంపూర్ణ మ‌ద్దతు తెలుపుతున్నాం. కేసీఆర్ క‌చ్చితంగా దేశ రాజ‌కీయాల్లో ఉండాలి. దేశాన్ని అభివృద్ధిప‌థంలో న‌డిపించాలి.

రంగారెడ్డి బద్దం (పెరూ): దేశంలో అపార వ‌న‌రులున్నాయి. వాటిని వినియోగించ‌డంలో ప్ర‌స్తుత పాల‌కులు విఫ‌ల‌మ‌య్యారు. అందుకే దేశం అధోగ‌తిపాలైంది. కేసీఆర్ నాయ‌క‌త్వంలోనే దేశం బాగుప‌డుతుంది.

వీరితోపాటు యూకే నుంచి నవీన్, సృజనరెడ్డి, రమేశ్‌బాబు, హరి, సురేశ్‌, కల్యాణ్, కిరణ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా తరపున నరేందర్‌రెడ్డి, హరీశ్ రంగా, అరవింద్ ప్రసాద్, సుఖేశ్‌, వెంకట్‌రావు తాళ్లపల్లి, నరేశ్‌ యాదారి, అరవింద్ ప్రసాద్, పరశురామ్ (సిడ్నీ) , కువైట్ నుంచి సురేశ్‌, రవికాంత్, జర్మనీ నుంచి కిశోర్‌, స్విట్జ‌ర్లాండ్ నుంచి శ్రీనివాస్, నార్వే నుంచి సుమన్, వివిధ దేశాల ప్ర‌తినిధులు మ‌హేశ్ బిగాల ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానానికి మ‌ద్దతు తెలిపారు.