Get Mystery Box with random crypto!

తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం నుండి రావాల్సిన 9 వేల కోట్లు ఇవ్వకుం | TRS Party

తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం నుండి రావాల్సిన 9 వేల కోట్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నరు.

ఆర్థిక సంఘం నివేదికను తొక్కిపెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందా..

ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 9 వేల కోట్లు స్టేట్ స్పేసిఫిక్ గ్రాంట్ గా, సెక్టార్ స్పేసిఫిక్ గ్రాంట్ గా ఇవ్వమని చెబితే ఎగబెట్టిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం.

మిషన్ కాకతీయకు, మిషన్ భగీరథకు 24 వేల కోట్లు ఇవ్వమంటే పట్టించుకోలేదు. ఐటీఐర్ ను రద్దు చేస్తరు. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరు...నిధులు ఇవ్వరు..బయ్యారం ఉక్కు ఫ్యాక్టీరీ పెట్టరు.

తెలంగాణకు అన్యాయం తప్ప బీజేపీ ఏం చేయడం లేదు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. తెలంగాణ గుండెల నుండి పుట్టిన పార్టీ.

టూరిజం ఎకో ప్రాజెక్టు ను త్వరలోనే ప్రారంభించుకుందాం..

35 కోట్లు నర్సాపూర్ నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మతులకు మంజూరు చేయడం జరిగింది.

గోదావరి నీళ్లు తేవడమే ఒక్క పని మిగిలి ఉంది. ఆ పని త్వరలోనే పూర్తవుతుంది.