Get Mystery Box with random crypto!

శాస్త్రవేత్తలు వడగండ్లు, అకాల వర్షాలను తట్టుకునే వంగడాలను తయార | TRS Party

శాస్త్రవేత్తలు వడగండ్లు, అకాల వర్షాలను తట్టుకునే వంగడాలను తయారుచేయాలి

ఫసల్ భీమాకు ప్రత్యామ్నాయంగా పంటలు యూనిట్ గా భీమా కంపెనీలతో మాట్లాడి శాస్త్రీయంగా కొత్త విధానం తీసుకురావాలి

- మంత్రి శ్రీ అజయ్ కుమార్ గారి వ్యాఖ్యలు

వ్యవసాయం చేసే రైతుకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది

ఈ ఏడాది మిరపలో తామరపురుగు, గత ఏడాది పత్తిలో గులాబీ పురుగులు రైతులను దెబ్బతీశాయి

ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు

వ్యవసాయ, ఉద్యానరంగ విద్య పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావాలి

- మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలు

వ్యవసాయరంగం ఆర్థికంగా బలపడేందుకు చేయూతనివ్వాలి

ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు క్షేత్రస్థాయి సందర్శనకు పంపిస్తున్నాం

గోదాముల సంఖ్య పెంచి నిల్వసామర్ద్యం పెంచాలి

కోల్డ్ స్టోరేజ్ , డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం కలిపించాలి

- మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు

పంటల వైవిధ్యీకరణపై పెద్ద ఎత్తున దృష్టి సారించాలి

ఆ మేరకు రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాలి

నిజామాబాద్ , కామారెడ్డిలలో దాల్ మిల్ లను ఏర్పాటు చేయాలి

కోల్డ్ స్టోరేజ్ సామర్ద్యం పెంచాలి

చైనా, ఇజ్రాయిల్ వ్యవసాయ విధానాలను అధ్యయనం చేయాలి

నూతన క్రాప్ ఇన్సూరెన్స్ విధానంపై దృష్టి సారించాలి

- మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలు

రంగారెడ్డి జిల్లాలో ఫ్లోరికల్చర్ సాగు ప్రోత్సహించాలి

వివిధ కార్పోరేట్ మాల్స్ తో ఒప్పందం చేసుకుని కూరగాయలు పండిస్తూ అధిక లాభాలు సాధిస్తున్నారు

- మంత్రి శ్రీ గంగుల కమలాకర్ వ్యాఖ్యలు

దేశంలో ఉత్పత్తి పెరుగుతున్నది .. వినియోగం తగ్గుతున్నది

వరి ధాన్యంలో యాసంగిలో నూక శాతం తగ్గే వంగడాలను రూపొందించాలి

25, 26 శాతం తేమ ఉన్నప్పుడే వరి కోతలు పూర్తి చేస్తే మిల్లింగ్ కు వచ్చే వరకు నూకశాతం తక్కువ ఉంటుంది

రాష్ట్రంలో అంతరపంటగా కొకొవా సాగును ప్రోత్సహించాలి

- మంత్రి శ్రీ జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు

సాగునీటి రాకతో తెలంగాణలో పంటల ఉత్పత్తి పెరిగింది

నిల్వకు అవకాశం, మార్కెట్ గ్యారంటీ ఉండడంతో వరి, పత్తికి మొగ్గుచూపుతున్నారు

వైవిధ్యమయిన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి

- మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలు

వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో ఏఏ పంటలు సాగుచేస్తున్నారు

ఆ ప్రాంత భూములను బట్టి ఏ పంటలు వేస్తే అధిక దిగుబడులు వస్తాయో ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలి

విత్తనపంటల సాగువైపు రైతులను మళ్లించాలి .. విత్తనశుద్ది ప్లాంట్లను ఏర్పాటు చేయాలి

- శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు

వ్యవసాయ ఆదాయ పెరుగుదలలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది

సిక్కిం తర్వాత తెలంగాణ 6.7 శాతంతో అగ్రస్థానంలో ఉంది

ఒకేసారి కోతకు వచ్చే పత్తి వంగడాల మీద దృష్టి సారించాలి

కాళేశ్వరం వంటి సాగునీటి ఎంత కష్టపడి తీసుకువచ్చామో ప్రతి రైతుకు, ప్రతి ప్రజాప్రతినిధికి తెలియాల్సిన అవసరం ఉన్నది